జగన్ గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తున్న మోడీ !

Modi plans on Early polls in India but Jagan scared on that Proposal

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల వైపే మొగ్గు చూపుతున్నట్టు జాతీయ మీడియాలో కధనాలు ప్రారంభం అయ్యాయి. ఈ ముందస్తు వ్యూహం వెనుక మోడీ ఉన్నాడని తెలుస్తోంది. రానున్న అక్టోబర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే దేశ వ్యాప్తంగా మోడీ వ్యతిరేక పవనాలు వీయడం ప్రారంభం అయ్యాయి. దీంతో ఇటీవల కొన్ని రాష్ట్రాల ఎన్నికలు, తాజాగా వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలే వాటికి నిదర్శనం దీంతో ఇప్పుడు మరలా ఆయా రాష్ట్రాల ఎన్నికలకి వెళితే అక్కడ కూడా ఓడిపోతే తర్వాత జరగనున్న సార్వత్రిక ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో మోడీ ఇప్పుడు ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీకి సెంటిమెంట్ గా ముందస్తు ఎన్నికలు అచ్చిరావడం లేదు.

గతానుభవాలు ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మరి ఈ క్రమంలో సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు వాటిని తోసిరాజని మళ్లీ ముందస్తుకు వెళతారా? అంటే కష్టమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక పోతే జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో ఈ ముందస్తు రైళ్ళు పరిగెడుతున్నట్టు అర్ధమవుతోంది ఎందుకంటే మోడీకి వ్యతిరేకమని ముద్ర పడ్డ ఆంధ్రజ్యోతి పత్రిక ఈ ముందస్తు ఎన్నికల గురించి బ్యానర్ ఐటెం ప్రచురించగా ప్రధాని మోడీకి ఎప్పుడు అడిగితే అప్పుడు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్న జగన్ పత్రిక కానీ చానల్ కానీ ముందస్తు ఎన్నికలు అనే మాటని కూడా ఎక్కడా వాడలేదు. అసలు ఉప ఎన్నికలకి వెళితే గెలుస్తామో ? లేదో ? నన్న భయంతోనే జగన్ వాటిని వాయిదా వేయిస్తూ వచ్చాడని ప్రచారం జరగగా ఇప్పుడు ఆ ముందస్తు ఎన్నికలకి వెళ్ళాలంటే జగన్ భయ పడుతున్నాడు అని అందుకే ఆయన కనీసం ఆ మాట కూడా మాట్లాడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.