ప్రభుత్వాసుపత్రి భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

ప్రభుత్వాసుపత్రి భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

తీవ్ర మనస్తాపంతో ప్రభుత్వాసుపత్రి భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నగరంలో చోటు చేసుకుంది. కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న మహిళను వైద్యులు డిశ్చార్జ్‌ చేయగా, ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మహిళ ఆసుపత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఆదిలక్ష్మిగా ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు.

మరోవైపు కుమారుడికి కరోనా సోకడంతో ఓ వృద్ధుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌పై ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే సమీపంలో ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ వన్‌టౌన్‌ పోలీసులు సకాలంలో స్పందించి అతడిని కాపాడారు. అనంతరం జీజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు మచిలీపట్నంకు చెందిన నాగేశ్వరరావుగా గుర్తించారు.