ఫస్ట్‌లుక్‌ తో అదరగొడుతున్న విజయ్‌ దేవరకొండ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’

ఫస్ట్‌లుక్‌ తో అదరగొడుతున్న విజయ్‌ దేవరకొండ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’

విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంకు ఇటీవలే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెల్సిందే. క్రాంతి మాధవ్‌ తన సినిమాల్లో హీరోలను చాలా సాఫ్ట్‌గా చూపిస్తాడు. కనుక విజయ్‌ దేవరకొండను ఎలా చూపించబోతున్నాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ వచ్చింది. ఊహకు అందని విధంగా ఈ చిత్రం లుక్‌ ఉందంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.

అర్జున్‌ రెడ్డిలో విజయ్‌ దేవరకొండను ఎలా అయితే చూశామో జుట్టు మరియు గడ్డంతో అలాగే ఈ చిత్రంలో కూడా విజయ్‌ దేవరకొండను చూడబోతున్నట్లుగా ఫస్ట్‌లుక్‌ చూస్తేనే అనిపిస్తుంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఈ ఫస్ట్‌లుక్‌తో అనిపిస్తుంది. టైటిల్‌కు తగ్గట్లుగా ఫస్ట్‌లుక్‌ ఒక వలర్డ్‌ ఫేమస్‌ లవర్‌లా విజయ్‌ దేవరకొండ ఉన్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రంను ఈ ఏడాది చివరి వరకు విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విడుదల తేదీ విషయంలో త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.