నాలుగు చోట్ల విజయం కన్ఫర్మ్ చేసుకున్న వైసీపీ

YCP confirming victory in four places
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తొలి విజయం నమోదు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి వైసీపీ అభ్యర్థి ఎలిజా 31,800 ఓట్లతో విజయం సాధించారు. ఈ విజయంతో వైసీపీ శ్రేణులుe సంబరాల్లో మునిగిపోయాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా, కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేశ్, విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావులు విజయం సాధించారు. కాగా, కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆర్కేలు తమ సమీప ప్రత్యర్థులపై ముందంజలో ఉన్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తొలి విజయం నమోదు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి వైసీపీ అభ్యర్థి ఎలిజా 31,800 ఓట్లతో విజయం సాధించారు. ఈ విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా, కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యేఅభ్యర్థి జోగి రమేశ్, విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావులు విజయం సాధించారు. కాగా, కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆర్కేలు తమ సమీప ప్రత్యర్థులపై ముందంజలో ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఫ్యాను జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు గానూ 25 స్థానాల్లోనూ లీడింగ్ లో కొనసాగుతోంది. నెల్లూరు అర్బన్ లో వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ నేత, మంత్రి నారాయణపై 4,400 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. పీలేరులో వైసీపీ నేత చింతల రామచంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పై లీడ్ లో కొనసాగుతున్నారు. అలాగే నంద్యాలలో శిల్పా రవిచంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిపై ఆధిక్యంలో ఉన్నారు