వైసీపీ ఆ రెండు స్థానాలను కూడా వదిలేలా లేదుగా…హైకోర్టుకు వెళతారట ?

YCP did not even leave those two places

ఏపీ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయనున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో సోమవారం పలువురు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫలితాలపై హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రిటర్నింగ్‌ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు వైసీపీ నేతలు చెప్పారు. ఈ రెండు స్థానాల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకుండానే నిబంధనలకు విరుద్ధంగా రిటర్నింగ్‌ అధికారి ఫలితాలను అధికారికంగా ప్రకటించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ రెండు స్థానాల్లో ఓట్లను పూర్తిగా లెక్కించకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను ప్రకటించారని గుంటూరు లో దాదాపు 9,700పైచిలుకు పోస్టల్‌బ్యాలెట్లను లెక్కించకుండా తిరస్కరించడంతో ఫలితం తారుమారైందని అంటూన్నారు. మోదుగులపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4,205 ఓట్ల స్వల్ప ఆ ధిక్యతతో గెలుపొందారు. మొత్తం నమోదైన 14వేల పైచిలుకు పోస్టల్‌బ్యాలెట్లలో 4,600 ఓట్లను లెక్కించగా, వాటిలో మోదుగులకు 3 వేలు, గల్లాకు 1200పైచిలుకు వచ్చాయి. 9,700 ఓట్లను తిరస్కరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫాం 13(ఏ) ద్వా రా నమోదుచేసిన పోస్టల్‌బ్యాలెట్లకు సంబంధించి 13(బీ) నంబర్‌ను కవర్‌ మీద వేయలేదన్న సాకుతో తిరస్కరించారని అందుకే కోర్టుకు వెళ్తున్నామని చెబుతున్నారు.