వైకాపా ఎంపీల సూపర్ స్కెచ్…కర్ర విరక్కుండా పాముని చంపాలి !

Ycp mps super sketch to skip bye polls

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్ రాజాకీయ వర్గాలలో ఇప్పుడు వైసీపీ ఎంపీల రాజీనామా మీదనే చర్చ నడుస్తోంది. వైసీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదిస్తారా? ఆమోదిస్తే ఎన్నికలు వస్తాయా రావా? వస్తే ఎప్పుడు వస్తాయి? అని అయితే దీని మీద లోతుగా విశ్లేషించిన మీదట కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, తమ పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీల భవిష్యత్తుపై జూన్ 5 నుంచి 7వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించిన తరుణంలో, వీరి రాజీనామాలు ఆమోదించినా, ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఎంతమాత్రమూ కనిపించడం లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఉప ఎన్నిక జరిగితే గెలిచే సభ్యుడి పదవీకాలం సంవత్సరం ఉండాలట.

2019 జూన్ 4తో మోదీ సర్కార్‌కు ఐదేళ్ళు నిండుతాయి. జూన్ 5నే ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నా, ఎన్నికలు జరగాలంటే ఆపై మరో నెల రోజుల సమయమైనా పడుతుంది. అప్పుడు గెలిచే సభ్యుడి పదవీకాలం ఏడాది ఉండదు. ఇక నెలన్నర క్రితమే వీరి రాజీనామాలు ఆమోదం పొందినా, ఉప ఎన్నికలు వచ్చేవి కావని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక నెలన్నర క్రితమే వీరి రాజీనామాలు ఆమోదం పొందినా, ఉప ఎన్నికలు వచ్చేవి కావని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇదే విషయం మీద రెండు రోజుల కిందట రాజీనామాలపై ఎంపీలు సుమిత్రా మహాజన్‌తో వైసీపీ ఎంపీలు సమావేశమయ్యారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశాము గనుక వాటిని తక్షణమే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమాల ప్రభావంతో రాజీనామా చేశారా? అందువల్లనే అయితే రాజీనామాలపై పునరాలోచన చేయాలని ఎంపీలను స్పీకర్ కోరినట్లు తెలిసింది. స్పీకర్‌తో సమావేశం ముగిసిన అనంతరం మాట్లాడిన ఎంపీలు రాజీనామాలపై పునరాలోచన చేయమని కోరారని, అయితే తమ వైఖరిలో మార్పు లేదని తెలిపామన్నారు.

రాజీనామాలు ఆమోదం ఆలస్యం చేస్తే మళ్లి స్పీకర్‌ను కలుస్తామన్నారు. అయితే ఇక్కడే చాలామందికి సందేహం వస్తోంది ఎందుకంటే ఇంతకు ముందే ఒకసారి వైసీపీ ఎంపీలతో స్పీకర్ వ్యక్తిగతంగా మాట్లాడారు. తొలి సారి రాజీనామా లేఖలిచ్చినప్పుడు వారితో మాట్లాడారు. మంగళవారం మరోసారి మాట్లాడారు. ఈ రెండు సార్లు వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు..తమ రాజీనామాలు ఆమోదించాలనే చెప్పారు. కానీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం మరోసారి ఆలోచించుకోవాలని చెప్పి వెనక్కి పంపేసారు పంపేశారు. ఎంపీలు .. స్పష్టంగా తమ రాజీనామాలు ఆమోదించాలని చెప్పిన తర్వాత… ఎందుకు స్పీకర్ ఆలోచించుకోవాలని చెబుతున్నారనేది అందరి మెదళ్ళని తొలిచేస్తోంది. మొత్తానికి వైసీపీ ఎంపీలు ప్రత్యేకహోదా కోసం తాము పదవులను త్యాగం చేశామన్న సానుభూతి పొందాలనుకుంటున్నారు కానీ ఉపఎన్నికలు మాత్రం రాకూడదనుంటున్నారు దీని కోసం… పక్కా వ్యూహాన్నే అమలు చేస్తున్నారు. ఎటూ చట్టబద్దంగా కూడా కుదరదు కానీ వారు అనుకున్నట్టుగానే ఇప్పుడు కర్ర విరగకుండానే పాము చచ్చినట్టు అయ్యింది.