ఏ మంత్రం వేసావె… తెలుగు బులెట్ రివ్యూ

Ye Mantram Vesave review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :      విజయ్ దేవరకొండ,శివాని సింగ్
నిర్మాత :           శ్రీధర్ మర్రి 
దర్శకత్వం :        శ్రీధర్ మర్రి 
మ్యూజిక్ :        అబ్దుస్ సామేద్

విజయ్ దేవరకొండ… ఇప్పుడు యూత్ లో బాగా క్రేజ్ ఉన్న హీరో… పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డ్డి సినిమాలతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు ‘ఏ మంత్రం వేసావే’ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలకు తగట్టు ఆ చిత్రం ఉందో, లేదో తెలుసుకోవాలంటే ఒకసారి రివ్యూ లోకి వెళ్ళాల్సిందే…

కథ :

నిక్కీ అలియాస్ నిఖిల్ (విజయ్ దేవరకొండ) గేమ్స్ మరియి ఇంటర్నెట్ కి భానిస… ఎప్పుడూ గేమ్స్ ఆడుతూ, ఇంటర్నెట్ లో అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ ఆ రెండే ప్రపంచం అనుకోని ఇంట్లోనే ఉంటాడు. ఒకరోజు వీడియో చాటింగ్ లో  రాగ్స్ అలియాస్ రాగ‌మాలిక (శివాని సింగ్) చూస్తాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా ప్రేమలో పడేస్తాను అని తన ఫ్రెండ్ తో పందెం వేస్తాడు. త‌న‌ని క‌ల‌వాలంటే రియ‌ల్ లైఫ్‌లో ఓ గేమ్ ఆడి గెల‌వాల‌నే కండీష‌న్ పెడుతుంది. ఊరు పేరు తెలియని ఆమె కోసం నిక్కీ, ఇంటి ప్రపంచం నుంచి బయట ప్రపంచానికి వస్తాడు. ఇంకోవైపు స్వీట్ గాయ్ అనే ఒక వ్యక్తి అమాయకుడిగా నటించి, అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి కిడ్నాప్ చేస్తాడు. ఆ స్వీట్ గాయ్ కూడా శివాని సింగ్ కోసం ప్రయత్నం చేస్తుంటాడు. శివాని సింగ్ కోసం బయట ప్రపంచానికి వచ్చిన నిక్కీ ఆ అమ్మాయిని ఎలా కనిపెట్టాడు? ఆ అమ్మాయిని కనిపెట్టే ప్రయత్నంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ?, అసలు ఆ అమ్మాయి నిక్కీ తో పందెం వేయటానికి కారణాలు ఏంటి.?అసలు స్వీట్ గాయ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఏమి చేస్తున్నాడు? ఇలాంటివి అన్ని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే…

విశ్లేషణ :

ఇంటర్నెట్, ఆన్లైన్ గేమ్స్ వలన యూత్ ఎలా చెడిపోతుంది… దాని వలన వాళ్ళు ఎదుర్కుంటున్న ఇబ్బందులు ఏంటి. అనే కాన్సెప్ట్ మీద సినిమా మొత్తం తిరుగుతుంది. హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో బాగా నటించాడు. ఈ సినిమాలో అతని లుక్ చాలా బాగుంది. ఆ అమ్మాయిని వెతికే ప్రయత్నంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్ శివాని సింగ్, ఈ చిత్రం ఆమెకు మొదటి సినిమా… ఈ చిత్రం మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది… క్యారెక్టర్ స్కోప్ ఉన్నా కూడా, ఈ సినిమాలో ఆమె నటనతో ఆకట్టుకోలేకపోయింది. కొన్ని కొన్ని సీన్స్ ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెడతాయి. కామెడీ పర్వాలేదు… ఈ చిత్రానికి డైరెక్టర్ శ్రీధర్ మర్రి… తను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ, దానిని ప్రెసెంట్ చేయటంలో అతను విఫలం అయ్యాడు… అతను సినిమాపై ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. మ్యూజిక్ డైరెక్టర్ ‘అబ్దుస్ సామేద్’ చెప్పుకోదగ్గ మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. శివారెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అస్స‌లు బాలేదు. సినిమా నడిచిన విధానంఅస్స‌లు బాలేదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.

ప్లస్ పాయింట్స్ : 
విజయ్ దేవరకొండ
కాన్సెప్ట్ 

మైనస్ పాయింట్స్ :

 కథనం
సినిమాటోగ్ర‌ఫీ
దర్శకత్వం  
మ్యూజిక్

తెలుగు బులెట్ రేటింగ్… 2 / 5 .