గత జన్మలో ‘ఆమె’ తన భర్తట…విద్యార్థినిపై మహిళ అఘాయిత్యం…!

You Are My Husband Woman Is Harassing Woman

పిచ్చి పలు రకాలు అంటారు కొందరు. కొందరికి వేపకాయంత వెర్రి ఉంటుందంటారు మరికొందరు. ఇప్పుడీ విన్నాక మీరేమంటారో కానీ ఆశ్చర్యమో, భయమో అప్రయత్నంగా ఏదో ఒకటి కచ్చితంగా రాక మానదు. వివరాల్లోకి వెళితే “గత జన్మలో నువ్వే నా భర్త. ఈ జన్మలో అమ్మాయిగా జన్మించావు అయినా సరే నువ్వు నాతోనే ఉండాలంటూ ఓ వివాహిత మహిళ, బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థినిని వేధిస్తున్న ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైకి చెందిన వెరోనికా బరోడే అలియాస్ కిరణ్ (35) ఓ విద్యాసంస్థలో ట్యూటర్. ముంబైలోని ఓ ఆసుపత్రిలో తల్లికి తోడుగా ఉండేందుకు వచ్చిన ఇండోర్ కు చెందిన బీటెక్ విద్యార్థిని కిరణ్ కు పరిచయం కావడంతో ఇద్దరూ స్నేహితులయ్యారు. ఈ క్రమంలో ఇద్దరూ ఫోన్‌ నంబర్లు మార్చుకున్నారు. క్యాన్సర్‌ పేషెంట్‌ అయిన తన తల్లిని చూసుకునేందుకు సదరు విద్యార్థిని కొన్ని రోజులు ముంబైలో ఉంది. దీంతో కిరణ్‌ ఆమెకు తరచుగా ఫోన్‌ చేయడం మొదలుపెట్టింది.

husbend-husbend
విద్యార్థిని తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తూ కిరణ్‌ ఆమెతో స్నేహం పెంచుకుంది. అయితే కొన్ని రోజుల నుంచి ‘గత జన్మలో నువ్వే నా జీవితభాగస్వామివి. కాబట్టి ఈ జన్మలో కూడా నా భర్తగా ఉండే హక్కు నీకు మాత్రమే ఉంది. మనం పెళ్లి చేసుకుందాం’ అంటూ ఆమెను వేధించసాగింది. కిరణ్‌ వేధింపులతో విసిగిపోయిన విద్యార్థిని ఆమె ఫోన్‌ ఎత్తడం మానేసింది. ఈ క్రమంలో ఉన్మాదిగా మారిన కిరణ్‌ వేధింపులకు దిగింది. ఇండోర్‌లో విద్యార్థిని చదువుతున్న కాలేజీకి వెళ్లి ఆమె గురించి ఆరా తీసింది. ఆమె ముంబైలోని ఉందని తెలుసుకుని తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని వేధిస్తూ, ఓ కానిస్టేబుల్ సాయంతో ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. తేరుకున్న విద్యార్థిని, సేఫ్టీ అలారం మోగించడంతో, చుట్టుపక్కల వారు వచ్చి, కిరణ్, కానిస్టేబుళ్లను నిర్బంధించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కిరణ్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌లను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. డబ్బు కోసం కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారని భావించిన పోలీసులు విచారణలో కిరణ్‌ చెప్పిన కారణం విని విస్తుపోయారు.

hudbend-wife-together