బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ టైగర్….

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ టైగర్....
Cinema News

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం అనంతరం తారక్ అయితే మరిన్ని భారీ సినిమాలతో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ మాసివ్ లైనప్ ని తాను సెటప్ చేసుకున్నాడు. దీనితో తన లైనప్ పట్ల అందరిలో ఒక రేంజ్ ఆసక్తి నెలకొనగా ఈ గ్యాప్ లో అయితే తారక్ బాలీవుడ్ సినిమా “వార్ 2” తో బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడం అనేది కేజ్రీగా మారింది.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ టైగర్....
Junior NTR

అయితే ఈ భారీ సినిమా లో తారక్ ఇంకా జాయిన్ కావాల్సి ఉండగా ఈ మధ్యలో అయితే వార్ 2, పఠాన్ టైగర్ లాంటి ఫ్రాంచైజ్ తో స్పై యూనివర్స్ ని సెట్ చేసిన యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి రాబోతున్న భారీ సినిమా “టైగర్ 3” లో ఎన్టీఆర్ కోసం ఉంటుంది అని కొన్ని స్ట్రాంగ్ రూమర్స్ వైరల్ గా మారాయి.

మరి దీనితో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ టైగర్ 3 లో ఈ యంగ్ టైగర్ ని ప్రెజెంట్ చేస్తాడు అని ఒక టాక్ విస్తృతంగా వైరల్ గా మారగా దీనిపై అయితే క్లారిటీ తెలుస్తోంది . ప్రస్తుతానికి అయితే అలాంటిది ఏమి లేదని ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మాత్రం ఇంకొక్క రోజు ఆగితే తెలిసిపోతుంది అని చెప్పొచ్చు.