అక్కడ బాబుని ఫాలో అవుతున్న జగన్.

Ys Jagan follows to Chandrababu

Posted October 12, 2017 at 12:59
లోక్ సభ తో పాటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ?. షెడ్యూల్ ప్రకారం 2019 లో జరుగుతాయా లేక ముందస్తుగా వచ్చి పడతాయా ?. 2018 డిసెంబర్ లో ఎన్నికలు జరగవచ్చని ఇప్పటిదాకా వినిపిస్తున్న మాట. అయితే అంతకన్నా ముందే ఎన్నికలు జరగొచ్చని పార్టీ సమావేశంలో చెప్పేసారు వైసీపీ అధినేత జగన్. పాదయత్రకి ముందు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయిన జగన్ ఎన్నికల ప్రస్తావన కూడా తెచ్చారు. అక్టోబర్ లో ఎన్నికలు వస్తాయని చంద్రబాబు కూడా చెబుతున్నారుగా అందుకే అందరూ అన్ని విధాలుగా సిద్ధంగా వుండాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. ఎప్పుడు చంద్రబాబు ఏది చెప్పినా అందులో నిజం లేదని చెప్పే జగన్ ఇక్కడ మాత్రం ఆయన్ని ఫాలో అయిపోతూ ఎన్నికలకి పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

నిజానికి నిన్నమొన్నటిదాకా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని జగన్ తహతహలాడిపోయారు. నిన్న పార్టీ సమావేశంలో ఆ మాట అయితే ఎత్తి సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. కానీ జగన్ మోహంలో ఎన్నికలు ముందుగానే వస్తున్నాయన్న సంతోషం ఎక్కడా కనిపించలేదు. అదే టాపిక్ మీద ఆ సమావేశంలో పాల్గొన్న కొందరు నాయకులు కూడా చర్చించుకున్నారు. ఓ పెద్దాయన మాత్రం అంతా నంద్యాల, కాకినాడ ఎఫెక్ట్ అంటూ ఒక్క మాటలో ఆ టాపిక్ ని తేల్చేసాడు. మరి నిజంగానే అక్టోబర్ లో ఎన్నికలు వస్తే మన పరిస్థితి ఏంటి అని ఇంకో నేత అడిగితే మీటింగ్ లో జగన్ పేస్ ఎలా పెట్టాడో ఓ సారి వీడియో రివైండ్ చేసి చూస్తే అర్ధం అయిపోతుందని చెప్పాడట. ఆ మాటలు చాలు అక్టోబర్ లో ఎన్నికలు వస్తే వైసీపీ పరిస్థితి ఏమిటో చెప్పడానికి.

SHARE