పాద‌యాత్ర‌లో త‌ప్పుడు లెక్క‌లు…

YS Jagan padayatra for 6 months covering 3000km

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌కు స‌ర్వం స‌న్న‌ద్ధ‌మ‌యింది. న‌వంబ‌రు 6న క‌డ‌ప జిల్లా ఇడుపుల పాయ‌లో యాత్ర ప్రారంభం కానుంది. జ‌గ‌న్ ఆరు నెల‌ల్లో మూడువేల కిలోమీట‌ర్లు యాత్ర చేస్తార‌ని ప్ర‌క‌టించారు. అయితే ఆయ‌న ఎంత వేగంగా న‌డిచినా ఆరు నెల‌ల కాలంలో 3,000 కిలోమీట‌ర్లు న‌డ‌వ‌లేరు. వారానికి నాలుగు రోజుల పాటు యాత్ర సాగుతుంది. ప్ర‌జ‌ల‌తో స‌మావేశాలు, బ‌హిరంగ స‌భ‌లు, ఇష్టాగోష్టిల‌కు స‌మయం కేటాయిస్తూ సాగే యాత్రలో జ‌గ‌న్ రోజుకు 15కిలోమీట‌ర్లు మాత్ర‌మే క‌వ‌ర్ చేయ‌గ‌ల‌రు. వారానికి నాలుగు రోజులు చొప్పున అనుకుంటే ఒక వారంలో ఆయ‌న న‌డవ‌గ‌లిగేది 60కిలోమీట‌ర్లు మాత్ర‌మే. ఈ లెక్క‌న ఆరు నెలల్లో ఆయ‌న న‌డ‌వ‌గలిగేది 1440 కిలోమీట‌ర్లు.

Ys-jagan-Padayatra-Schedule

వారానికి ఆరు రోజుల పాటు పాద‌యాత్ర చేస్తార‌ని భావించినా… నెల‌కు 360 కిలోమీట‌ర్లు, ఆరు నెల‌ల‌కు 2,160 కిలోమీట‌ర్లు మాత్ర‌మే జ‌గ‌న్ పూర్తిచేయ‌గ‌ల‌రు. కానీ వైసీపీ ప్ర‌చారం చేసుకుంటున్న‌ట్టుగా… ఆరు నెల‌ల్లో 3,000 కిలోమీట‌ర్లు న‌డ‌వ‌డం అసాధ్యం. అందుకే సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్ పాద‌యాత్రపై ఓ సెటైర్ న‌డుస్తోంది. పాద‌యాత్ర‌లోనూ దొంగ లెక్క‌లు చెప్తున్నార‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. ఇడుపుల పాయ‌లో మొద‌ల‌యి ఇచ్చాపురంలో ముగియ‌నున్న యాత్ర‌లో జ‌గ‌న్ ఎన్ని కిలోమీట‌ర్లు న‌డ‌వ‌గ‌ల‌రో చూడాలి.