టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లే వెళ్లే పరిస్థితులు లేవని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వేర్వేరు జిల్లాల నేతలతో సమావేశమవుతూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కనపెట్టేశారని జగన్ ఆరోపించారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కాస్త బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అయ్యిందన్నారు. ప్రజలు కూటమి నేతల కాలర్ పట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు.