వైసీపీ లిస్ట్ విడుదల వాయిదా…బాబు ప్రకటించాకే !

YS Jagan Sensational Comments On Chandrababu Naidu

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ పడే అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయబోవడం లేదు. ఈ ఉదయం పార్టీ సీనియర్ నేతలు ఉమారెడ్డి, తమ్మినేని సీతారాం, పిల్లి సుభాష్ చంద్రబోస్, విజయసాయిరెడ్డి తదితరులతో సమావేశమైన వైఎస్ జగన్, దాదాపు గంట సేపు జాబితాకు తుదిరూపు నిచ్చేందుకు చర్చలు జరిపారు. ఆపై ఈ నెల 16వ తేదీన ఉదయం 10.26 నిమిషాలకు తమ పార్టీ తొలి జాబితా విడుదలవుతుందని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. జాబితాలో కొన్ని మార్పులు చేయాల్సి వున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రేపు బాబు తోలి జాబితా ప్రకటించనున్నారు అందులో సీట్ దక్కని వారు, వైసీపీ బలమైన అభ్యర్ధులుగా భావిస్తున్న వారు ఎవరైనా ఉంటె గనుక వారిని పార్టీ వైపు ఆకర్షించవచ్చని చెబుతున్నారు. అందుకే 16న విడుదల చేయాలని చూస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇడుపులపాయలోని మహానేత వైఎస్ స్మారకం పార్టీకి సెంటిమెంట్ గా ఉందని, అక్కడే జాబితాను విడుదల చేయాలని పలువురు నేతలు కోరడంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జాబితా విడుదల తరువాత, వెంటనే జగన్ ప్రచార పర్వాన్ని ప్రారంభిస్తారని సమాచారం.