మళ్ళీ రంగంలోకి షర్మిల అక్కడి నుండే పోటీ !

YS Sharmila Will Contest In 2019 Elections From Ongole or Kadapa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

షర్మిల ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది జగన్ అన్న వదిలిన బాణాన్ని అనే మాట. అంత బాగా జనాల్లోకి చోచ్చుకెళ్ళింది షర్మిల. వైఎస్ కుటుంబం నుండి వచ్చిన మనిషే అయినా జగన్ జైలుకి వెళ్ళేదాకా పెద్దగా జనాల్లోకి వచ్చింది కూడా లేదు. కానీ అక్రమాస్తుల కేసులో ఎప్పుడయితే జగన్ జైలుకి వెళ్ళాడో ఆయన చేపట్ట్టిన ఓదార్పు యాత్రని పూర్తి చేసిన షర్మిల తన ప్రసంగాలతో జనాలని బాగానే ఆకట్టుకుంది. అయితే 2014 ఎన్నికల్లో ఆమెకి ఎంపీ సీట్, లేదా ఎంల్ఏ సీట్ అయినా ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే అది మనసులో పెట్టుకుని ఆమె ఇక రాజకీయాల వంకా, తమ పార్టీ వంకా చూడలేదు అని చెబుతుంటారు. 
అయితే ఇప్పుడు షర్మిల మరలా రంగం లోకి దూకేందుకు సిద్దమయ్యింది అని తెలుస్తోంది. కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న షర్మిల 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమె మళ్లీ తమ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొననున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిల వైసీపీ తరపున ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని గత ఎన్నికల్లో విజయమ్మని చిత్తు చిత్తుగా వోడించిన విశాఖపట్టణం స్థానం నుండే ఆమె ఈసారి నిలబడి విజయం సాధించాలి అని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక సారి అక్కడ తమ తల్లి విజయమ్మని నిలబెట్టి అపహాస్యం పాలయిన జగన్ షర్మిలని వేరే స్థానం నుండి పోటీ చేయమని సూచిస్తున్నరని తెలుస్తోంది.
అయితే ఆమెని తమకి పట్టున్న మరో రెండు స్థానాల నుండి బరిలోకి దింపేందుకు జగన్ పాలన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. షర్మిలని ఒంగోలు లేదా కడప నుంచైనా బరిలోకి దింపాలని వైఎస్ జగన్‌ ఆలోచనగా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, సొంత కుటుంబం మనిషే ట్రాక్ రికార్డ్ కూడా మంచిదే కానీ ఆయన కాస్త మేతక అని పేరుంది. అలాగే వైవీ సుబ్బారెడ్డి కూడా అంతగా తెలుగుదేశం మీద విమర్శలు చేయడం లేదని వీరిద్దరిలో ఎవరో ఒకరి స్థానం నుండి షర్మిలని రంగంలోకి దింపాలని జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పాద్రయాత్రతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చిందని, రాబోయే రోజుల్లో జగన్ కు తోడుగా షర్మిల కూడా రంగంలోకి దిగితే పార్టీ క్యాడర్ మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.