వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అరెస్ట్

Vijaya Sai Reddy arrested at Vizag
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని విశాఖ నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖ నగరంలో నిన్న జరిగిన టీడీపీ ధర్మపోరాట సభకు వేదికైన మైదానాన్ని శుద్ధి చేయాలని పిలుపునిచ్చిన విజయసారెడ్డి, మరికొందరు నేతలను కలుపుకుని వైకాపా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. అయితే ఏయూ గ్రౌండ్‌ వైపు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అదే సమయంలో విజయసాయిరెడ్డి 16వ నంబర్‌ జాతీయ రహదారిపై కృష్ణా కళాశాల వద్ద బైటాయించారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆందోళన విరమించకపోవంతో సెక్షన్‌ 151 ప్రకారం అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.