ఆనంద్‌ కోసం బన్నీ, రవితేజ పోటీ

vi anand next movie with allu arjun and ravi teja

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విభిన్న చిత్రాల దర్శకుడిగా విఐ ఆనంద్‌కు పేరుంది. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మరియు ‘ఒక్క క్షణం’ చిత్రాలు కమర్షియల్‌గా అంతగా ఆకట్టుకోలేక పోయినా కూడా విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కించుకుంది. దాంతో ఈయనతో సినిమాలు చేసేందుకు స్టార్స్‌ ఆసక్తి చూపుతున్నారు. ఈయన గత చిత్రాల్లో స్టార్స్‌ లేకపోవడం వల్ల కమర్షియల్‌ సక్సెస్‌ కాలేదని, అదే పెద్ద హీరోలు చేస్తే ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను ఖచ్చితంగా వసూళ్లు చేసేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈయన దర్శకత్వంలో నటించేందుకు ప్రస్తుతం అల్లు అర్జున్‌ మరియు రవితేజలు పోటీ పడుతున్నారు. 

‘ఒక్క క్షణం’ పూర్తి అయిన కొన్నాళ్లకు రవితేజకు ఈ దర్శకుడు ఒక కథను చెప్పడం జరిగింది. ఆ కథకు రవితేజ ఓకే చెప్పడం, శ్రీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం చేసేదాం అంటూ హామీ ఇవ్వడం జరిగింది. రవితేజ డేట్ల కోసం ఎదురు చూస్తున్న ఆనంద్‌కు అల్లు అర్జున్‌ నుండి పిలుపు వచ్చింది. అల్లు శిరీష్‌తో ‘ఒక క్షణం’ చిత్రం చేస్తున్న సమయంలో బన్నీకి ఆనంద్‌తో పరిచయం అయ్యింది. ఆ సమయంలోనే రెండు మూడు స్టోరీ లైన్స్‌ను వివరించడం కూడా జరిగింది. అందులోంచి ఒక స్టోరీ లైన్‌ను పిక్‌ చేసుకున్న బన్నీ, దాంతో సినిమా చేసేద్దాం అంటూ ఆనంద్‌కు తాజాగా తెలియజేసినట్లుగా సమాచారం అందుతుంది. రవితేజ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్న సమయంలో ఇలా మెగా ఆఫర్‌ రావడంతో ఆనంద్‌ ఎటూ తేల్చుకోలేక పోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. నాపేరు సూర్య చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో బన్నీ ఈ ప్రయోగానికి సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.