హిందువునే అనే క్లారిటీ ఇచ్చిన వైవీ….కానీ ?

yv gave clarity that he is hindu

ఏపీలో అత్యంత ప్రతష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవికి జగన్ తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి నీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మీద క్రిస్టియన్ అనే విమర్సలు మొదలయ్యాయి.  ఓ హిందు ధార్మిక సంస్థ పదవిని క్రిస్టియన్‌కి ఎలా కేటాయిస్తారని, ఎవరినైనా హిందువును ఆ పదవిలో నియమించాలంటూ విమర్శలు పెరగడంతో సుబ్బారెడ్డి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో అమరావతిలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తాను వందశాతం హిందువునని, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి తమ ఇష్టదైవమని మాజీ ఎంపీ, టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఖరారైన వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన పేరును ఈ పదవి కోసం పరిశీలనలోకి తీసుకోగానే కొందరు గిట్టనివారు తాను క్రిస్టియన్‌ని అంటూ తప్పుడు ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో మొదలు పెట్టారని ఆయన విమర్శించారు.

తాను హిందువును కాదన్న విషయంలో అనుమానాలు అక్కర్లేదన్నారు. టీటీడీ చైర్మన్‌గా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తనకు అవకాశం ఇచ్చారని, దైవ సేవకు నన్ను పంపుతున్నందున తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. టీటీడీనే కాదు భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తానన్నారు. బాధ్యతలు చేపట్టాక ముఖ్యంగా స్వామివారి ఆస్తులు, ఆభరణాల విషయంలో వాస్తవాలు రాబడతామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని జగన్‌ కచ్చితంగా నెరవేరుస్తారని తెలిపారు. అయితే సుబ్బారెడ్డి హిందూవు అన్నట్టుగా ఎలాంటి ఆధారాలు చూపించలేదు. కానీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం వైవీ కి సబందించి కులపత్రం బయటకి వచ్చింది దాంట్లో క్రిస్టియన్‌ అని ఉంది.. దానికి సంబంధించి సుబ్బారెడ్డి ఎలాంటి వివరణ ఇవ్వలేదు.