దోమకాటు వల్ల వస్తున్న జికా వైరస్

దోమకాటు వల్ల వస్తున్న జికా వైరస్

దోమకాటు వల్ల జికా వైరస్ వస్తుంది. ముఖ్యంగా ప్రపంచంలో ట్రాపికల్ మరియు సబ్ ట్రాపికల్ ప్రాంతాలలో ఇది ఎక్కువగా వస్తుంది అని అంటున్నారు. అయితే జికా వైరస్ చాలా మందిలో ఏ లక్షణాలు లేకుండా వస్తుందని వైద్యులు గుర్తించారు. కొంత మందిలో అయితే కొద్దిపాటి జ్వరం, మజిల్ పెయిన్స్ వంటి సమస్యలు ఉంటాయని అంటున్నారు.

కొన్ని అరుదైన కేసుల్లో అయితే మెదడు లేదా నెర్వస్ సిస్టం కాంప్లికేషన్స్ కనిపిస్తాయని అంటున్నారు. అంటే Guillain-Barre syndrome లాంటి కాంప్లికేషన్స్ కూడా అరుదుగా కనిపిస్తాయి అని అన్నారు. జికా వైరస్‌ని జికా ఫీవర్ లేదా జికా వైరస్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ జికా వైరస్‌కి సంబంధించి మరెన్నో ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూసేయండి.

అయితే గర్భిణీలు ఎవరైతే జికా వైరస్ బారిన పడతారో.. వాళ్లలో ఎక్కువగా మిస్ క్యారేజ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అదే విధంగా ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీకి జికా వైరస్ సోకితే బర్త్ డిఫెక్ట్స్ లాంటి సమస్యలు కలుగుతాయి అని చెప్పారు. అలాగే microcephaly వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇది ఇలా ఉంటే జికా వైరస్‌కి సంబంధించి వ్యాక్సిన్‌పై నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికి జికా వైరస్‌ని రాకుండా చూసుకోవడానికి ఒకే ఒక్క దారి వుంది. అది ఏమిటంటే దోమలు కుట్టకుండా చూసుకోవడం. వీలైనంత వరకూ దోమలు రాకుండా చూసుకోవడం లాంటివి చేస్తే మంచిది.

ప్రతి ఐదుగురిలో నలుగురికి ఎటువంటి లక్షణాలు లేకుండా ఈ జికా వైరస్ వస్తోంది. దోమ కుట్టిన 2 నుండి 14 రోజులకు ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. లక్షణాలు ఉంటే వారం వరకు ఉంటాయని చాలా మంది పూర్తిగా రికవరీ అయిపోతారు అని అంటున్నారు వైద్యులు.