లాభాల్లో జొమాటో

లాభాల్లో జొమాటో

దేశంలో 500నగరాలూ,పట్టణాల్లో ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తున్న జొమాటో ఉద్యోగాల  కోతతో ఇటీవల వార్తల్లో నిలిచి ఇపుడు ఆదాయాలతో ముందుంది.కేవలం 200నగరాలూ,పట్టణాల్లో ఉండి,ఇపుడు భారీగా విస్తరించి ఇంకా గత12నెలల్లో కంపెనీఆర్డర్లు రెట్టింపు అవడం వల్ల ఆదాయం పెరిగింది.గతేడాది రూ 448 కోట్లు ఆదాయంతో,ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకి 1,458కోట్ల ఆదాయంతో మూడురెట్లు ఎక్కువ గడించింది.జొమాటో వ్యవస్థాపకుడు ఇంకా సీఈఓ అయిన దీపిందర్ గోయెల్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా ఈ వివరాలని తెలిపారు.

ఆర్టిఫిషల్ఇంటలిజెన్స్ వంటి టెక్నాలజీ వాడకంవల్ల ఉద్యోగులను తొలగించింది.ఇప్పటికే జోమాటోగోల్డ్ లో 6,300 రెస్టారెంట్లు ఉన్నాయి.ఇంకా 10,000రెస్టారెంట్లు కలిసాయని ఒకప్రకటనలో కంపెనీ తెలిపింది.