నమ్మలేని నిజం… బిగ్‌బాస్‌ ఇంటికి బాలయ్య?

Balakrishna in Big Boss Show for Paisa vasool Pramotion

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్‌’ షోకు విపరీతమైన టీఆర్పీ రేటింగ్‌ దక్కింది. ఇప్పటి వరకు ఏ తెలుగు షోకు రాని అరుదైన రికార్డు ఈ షోకు దక్కింది. భారీ స్థాయిలో దూసుకు పోతున్న ఈ షోను సినిమాల ప్రమోషన్‌ కోసం కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ షో ద్వారా ప్రమోట్‌ చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఆనందో బ్రహ్మా’, ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే బాలయ్య సినిమా ‘పైసా వసూల్‌’ చిత్రానికి కూడా బిగ్‌బాస్‌ ద్వారా ప్రమోట్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వారంలోనే బాలయ్య ‘బిగ్‌బాస్‌’ ఇంటికి వెళ్లబోతున్నాడు.

ఎన్టీఆర్‌, బాలయ్యలకు మద్య సన్నిహిత సంబంధాలు లేవు. కాని సినిమా ప్రమోషన్‌ కోసం స్వయంగా బాలయ్య వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్‌ రాని రోజు అంటే గురువారం రోజు బాలయ్య బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లబోతున్నాడు. మొత్తానికి బాలయ్య ‘బిగ్‌బాస్‌’ ఇంటికి వెళ్లబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. నందమూరి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ‘స్పైడర్‌’ చిత్రం కోసం మహేష్‌బాబు బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లనున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలకృష్ణ కూడా బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లేందుకు సిద్దం అయిన నేపథ్యంలో ఏ రేంజ్‌లో ‘బిగ్‌బాస్‌’ షో ప్రేక్షకుల ఆధరణ పొందుతుందో చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్టార్‌ మాటీవీని నెం.1 స్థానానికి చేర్చిన ఈ షో ఎన్టీఆర్‌ స్థాయిని కూడా పెంచేసింది. ఇక షోలో ఉన్న పార్టిసిపెంట్స్‌కు కూడా భారీ క్రేజ్‌ దక్కింది.

మరిన్ని వార్తలు:

కుశ సీరియస్ అండ్ జోవియల్.

అర్జున్ రెడ్డి మూవీ తెలుగు బులెట్ రివ్యూ…

బిగ్‌బాస్‌ ఇంటికి మహేష్‌బాబు..!