జగన్ కి థర్డ్ ఫ్రంట్ భయం… పీకే మీదకి పీకే ప్రయోగం?

jagan wants to alliance with janasena party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికలకు ఇంకా దాదాపుగా రెండేళ్ల గడువు ఉండగానే వైసీపీ ఇప్పుడే పొత్తులు, వ్యూహాలపై ఆత్రపడుతోంది. ప్రశాంత్ కిషోర్ ని ఎన్నికల వ్యూహకర్తగా నియమించడమే కాకుండా పార్టీ శ్రేణులకు పరిచయం చేయడం, నవరత్నాల పేరుతో పార్టీ మానిఫెస్టోని పరోక్షంగా ప్రకటించడం చూస్తుంటే జగన్ ఇప్పుడే అంత తొందర ఎందుకు పడుతున్నాడు అని సామాన్యులకే కాదు, వైసీపీ శ్రేణులకు కూడా అర్ధం కావడం లేదు. అయితే జగన్ తొందరపడి ముందే ఎన్నికల కూత కూయడం వెనుక వున్నది వ్యూహం కాదు భయమట. ఆ భయాన్ని కలిగించింది ఎవరో కాదు. లెఫ్ట్ పార్టీలు . అస్తిత్వం కోసమే వాళ్ళు పోరాటం చేస్తుంటే జగన్ ని ఎలా భయపెడతారని ఆశ్చర్యపోవచ్చు. కానీ లెఫ్ట్ పార్టీలు చేస్తున్న థర్డ్ ఫ్రంట్ ఆలోచన జగన్ ని ఉక్కిరిబిక్కిరి చేసిందట.

ఇటీవల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ థర్డ్ ఫ్రంట్ గురించి ఓ ప్రకటన చేశారు. లెఫ్ట్ పార్టీలు, జనసేన, లోక్ సత్తా ఆ కూటమిలో భాగస్వామిగా వుంటాయని ఆయన చెప్పారు. టీడీపీ, వైసీపీ లకు వ్యతిరేకంగా ఈ కూటమి పనిచేస్తుందని ఆయన చెప్పడం తో జనసేన సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది జగన్ కి. అంతే… విపక్ష కూటమి ఓట్లు చీలితే అధికార పక్షం ఎలా గెలవగలదో చూపిన 2009 ఎన్నికలు జగన్ కి గుర్తుకు వచ్చాయట. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ టీడీపీ గెలుపుకి గండి కొడితే, ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అదే రోల్ పోషించి వైసీపీ కి అడ్డుగా నిలుస్తాయని జగన్ భావించారట.

థర్డ్ ఫ్రంట్ అన్న ఆలోచనకు గండి కొట్టడానికి జగన్ తరపున ప్రయత్నాలు కూడా మొదలైనట్టు సమాచారం. థర్డ్ ఫ్రంట్ లో జనాకర్షణ వున్న పవన్ మీద జగన్ కన్ను పడింది. అందుకే తాము కూడా ఆ కూటమిలో చేరతానని చెప్పేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ కోరారట వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్. ఒకవేళ మీకు ఇబ్బంది లేకపోతే స్వయంగా మా పార్టీ అధ్యక్షుడు జగన్ మిమ్మల్ని కలుస్తాడని పవన్ ఆఫీస్ కి ప్రశాంత్ ఓ లేఖ కూడా రాశారట. అయితే ఆ లేఖ అందుకున్న పవన్ సిబ్బంది “ప్రస్తుతం సర్ బిజీగా వున్నారు. ఆయనకు మీరు చెప్పిన విషయం చేరవేస్తాం” అని బదులు ఇచ్చారట. ఆ విధంగా థర్డ్ ఫ్రంట్ భయంతో పీకే మీదకి (పవన్ కళ్యాణ్), పీకే ( ప్రశాంత్ కిషోర్ ) ని ప్రయోగించినా జగన్ ప్లాన్ ఫలించలేదు. అయినా ప్రశాంత్ సాయంతో థర్డ్ ఫ్రంట్ ని విపక్ష కూటమిగా మార్చేందుకు జగన్ మరిన్ని ప్రయత్నాలు చేస్తారట. అంటే 2019 ఎన్నికల్లో ఓటమి ఆలోచన జగన్ ని ఏ మాత్రం నిలవకుండా చేస్తోందేమో పాపం!

మరిన్ని వార్తలు 

కుక్కలు, పందులా… భూమన భాషకి సిగ్గుపడాలి.

వారంలో రెండు రోజులు ఏడుస్తున్నాడంట.

హైకోర్టు, అసెంబ్లీ తారుమారు…