Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘హ్యాపీడేస్’ ఫేం నిఖిల్ ఇటీవల వరుసగా విజయాలను అందుకున్న విషయం తెల్సిందే. చిన్న హీరోల్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న నిఖిల్ పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెల్సిందే. బిజినెస్‌మెన్ ఆంజనేయులు కుమార్తె తేజస్వితో వివాహంకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారని, ఇరు కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఓకే చెప్పారు. ఇటీవలే ఇరు కుటుంబాలు కూర్చుని ఈనెల 23న వివాహానికి నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. అయితే 23వ తారీకున నిశ్చితార్థం జరగలేదు. దాంతో సినీ వర్గాల్లో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.
మొదట కొన్ని కారణాల వల్ల నిశ్చితార్థంను అక్టోబర్‌కు వాయిదా వేశారని, అక్టోబర్‌లో మంచి ముహూర్తం చూసి పెళ్లి నిశ్చితార్థం లేదా డైరెక్ట్‌గా పెళ్లిని చేస్తారనే టాక్ వచ్చింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లి మొత్తానికి క్యాన్సిల్ అయ్యిందని, ఇద్దరి జాతకాలు కలవని కారణంగా ఇరు కుటుంబ సభ్యులు సఖ్యతతో మాట్లాడుకుని, పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇద్దరి జాతకాలను ప్రముఖ వేద పండితుల వద్దకు తీసుకు వెళ్లగా వారిద్దరి జాతకాలు కలవడం లేదని, కొన్ని దోష నివారణ చర్యలు చేయడం ద్వారా వారిని కలపవచ్చు అంటూ చెప్పారు. సహజంగా కలవని జాతకాలను నివారణ చర్యలు చేసి కలిపినా వారిద్దరు సంతోషంగా ఉంటారనే నమ్మకం లేదని, అందుకే వారి పెళ్లిని క్యాన్సిల్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరిన్ని వార్తలు: