ఇంద్రకీలాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భువనేశ్వరి..!

Bhuvaneshwari performed special pooja in Indrakiladri..!
Bhuvaneshwari performed special pooja in Indrakiladri..!

ఇవాళ ఉదయం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు చంద్రబాబు అరెస్ట్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. కొన్ని ఏరియాల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారీ భద్రతతో చంద్రబాబు కాన్వాయ్ విజయవాడకు తరలివెళ్తోంది. ప్రస్తుతం చిలుకలూరిపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ అయ్యారనే విషయం తెలుసుకొని నారా భువనేశ్వరి విజయవాడకు చేరుకుంది. తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రి నారా భువనేశ్వరి

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకుంది. చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని దుర్గమ్మకు నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.భువనేశ్వరితో పాటు, నందమూరి రామకృష్ణ, కేశినేని చిన్ని, జలీల్ ఖాన్ ఉన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎవరైనా ఆపద వస్తే అమ్మవారి వద్దకు వస్తారని, అందుకే తాము వచ్చామని తెలిపారు. చంద్రబాబు పోరాటం విజయవంతం అవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పుకొచ్చారు.