చంద్రబాబు అరెస్టు వైసీపీ అరాచకాలకు పరాకాష్ట – సీపీఐ నారాయణ

Chandrababu's arrest is the culmination of YCP's anarchy - CPI Narayana
Chandrababu's arrest is the culmination of YCP's anarchy - CPI Narayana

చంద్రబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ అరెస్ట్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ స్పందించారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు వైఎస్సార్ పార్టీ అరాచక పాలనకు పరాకాష్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు.

శనివారం ఉదయం తిరుపతి లో ఆయన మీడియా తో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్ట్ చెయ్యడం వైకాపా దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందన్నారు.

వైకాపా పాలనలో రెండు రకాల పాలన సాగుతోందన్నారు.అందులో ఒకటి రివర్స్ టెండెరింగ్, రెండోది రివేంజ్ పాలన చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం ను పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తుండడం దుర్మార్గం అన్నారు.వైకాపా ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలలో భాగంగా చంద్రబాబు ను అరెస్ట్ చెయ్యడం సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.