చంద్రబాబు అరెస్ట్..విజయవాడకు తరలింపు..

Chandrababu Arrested..Moved to Vijayawada.
Chandrababu Arrested..Moved to Vijayawada.

నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారు. స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు..ఆయనను విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబుపై సెక్షన్‌ 465, 468, 471, 409, 201 కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలోనే… నారా లోకేష్ పాదయాత్ర వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ లోకేష్ ను అడ్డుకున్నారు పోలీసులు.

ఎలాంటి నోటీసులు లేకుండా గంటసేపటి నుంచి పోలీసులు హై డ్రామా సృష్టిస్తున్నారు. నోటీసులు అడిగితే డిఎస్పీ వస్తున్నారు అని చెబుతున్నారు పోలీసులు. రోడ్డు మీద నుంచి క్యాంపు సైట్ లోకి రాకుండా ఆడుకుంటున్నారు డిఎస్పీ, ఏఎస్పీ. నారా లోకేష్ వద్దకు మీడియా కూడా రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. వస్తే అరెస్టు చేయాలని ఆదేశిస్తున్నారు పోలీసులు. నా తండ్రిని చూడడానికి నేను వెళ్ళకూడదా అని పోలీసులను నారా లోకేష్ నీలదీశారు . దీంతో సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు పోలీసులు.