చెమ్మక్ చంద్ర ఆస్తులు అన్ని కోట్లా..?

చెమ్మక్ చంద్ర ఆస్తులు
చెమ్మక్ చంద్ర ఆస్తులు

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కొంత మంది నటులు ఇప్పుడు వెండి తెరమీద కూడా నటిస్తున్నారు.
అందులో ఒకరే మన చెమ్మక్ చంద్ర.తను జబర్దస్తు షో లో చేసినప్పుడు తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఉండేది.చంద్ర చేసిన స్కిట్స్ వల్లే మొదట్లో జబర్దస్తు షో కి మంచి పేరు వచ్చింది అలాగే మంచి రేటింగ్ కూడా వచ్చింది.అయితే చంద్ర కెరియర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డట్లు ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు.ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తనకు పెద్దగా అవకాశాలు రాలేదని అలాంటి టైం లో తినడానికి కూడా తిండి లేదని ,అలా ఉన్న రోజుల్లో జబర్దస్త్ తనకి లైఫ్ ఇచ్చింది అని చెప్పాడు.

అయితే ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే జబర్దస్త్ పుణ్యమా అని చంద్ర చాలా ఆస్తులు సంపాదించుకున్నాడు.ప్రస్తుతం చంద్రకి చాలా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఆయనకి మణికొండ లో సొంత ఇల్లు ఉండి ఇప్పుడు ప్రస్తుతం అతను అందులోనే ఉంటున్నాడు.అలాగే లక్సరీ కార్ ఉంది.అలాగే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ల్యాండ్స్ కూడా ఉన్నాయి.ఇప్పుడు వాటి విలువ కోట్లల్లోనే ఉంటుంది అని తెలుస్తుంది.

సినిమా హీరో లకి ఎన్ని ఆస్తులు అయితే ఉంటాయో వాటికీ ఏ మాత్రం తగ్గకుండా చంద్ర ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. జబర్దస్త్ చేస్తున్నప్పుడే చంద్ర అన్ని టీంల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవాడని తెలుస్తుంది. చంద్ర ఒక్క ఎపిసోడ్ కి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు తీసుకునేవాడు. అలా చంద్ర బాగానే సంపాదించాడు. ఎక్కడో మారుమూలా ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్ లో చాలా ఇబ్బందులు పడి, తిని తినక కష్టపడ్డా చంద్ర కి మంచి ఫలితం దక్కిందని తనని దగ్గరి నుంచి చూసినవాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు కష్టపడుతున్న వాళ్ళకి చంద్ర ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు.