లోకేష్‌కు నాదెండ్ల సపోర్ట్..వేర్ ఇస్ పవన్ కళ్యాణ్ !

Nadendla support for Lokesh..Where is Pawan Kalyan !
Nadendla support for Lokesh..Where is Pawan Kalyan !

వారాహి మూడు విడతల యాత్ర చేసిన జనసేన అధినేత పవన్ ఏమయ్యారు .ఏపీ రాజకీయాల్లో అడ్రస్ లేరు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారాహి మూడు విడతల యాత్ర విజయవంతమైంది. జనసేనకు కాస్త ఊపు వచ్చింది. ఇలాంటి సందర్భంలో రాజకీయాలకు పవన్ దూరంగా ఉండటం వల్ల రాజకీయంగా జనసేన ఫామ్ కోల్పోయిందని చెప్పవచ్చు.

ఇలాంటి పరిస్తితులు వల్ల జనసేనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏ పార్టీ అయిన రాజకీయంగా సత్తా చాటాలంటే మొదట ఆ పార్టీ అధినేతలు నిత్యం ప్రజల్లోనే ఉండాలి. అలా కాకుండా కొద్దీ రోజులు కనిపించి,మళ్ళీ కొన్ని రోజులు కనిపించకపోవడం వలన పార్టీ బలోపేతం కాదు. ఇప్పుడు జనసేన పరిస్తితి కూడా అదే అవుతుంది. ఇక పవన్ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల నాదెండ్ల మనోహర్ కు జనసేన బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. అయితే పవన్‌కు ఉన్న మీడియా శ్రద్ధ నాదెండ్లకు ఏ మాత్రం ఉండదు. దీని వల్ల జనసేన గురించి చర్చ ఉండదు.

ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ, టి‌డి‌పిల మధ్యే పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన వెనుకబడింది. ఇక నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. తాజాగా భీమవరంలో లోకేష్ పాదయాత్రపై వైసీపీ శ్రేణులు రాళ్ళు రూవ్విన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టి‌డి‌పి శ్రేణులపై కేసులు నమోదయ్యాయి.

ఇక లోకేష్ పాదయాత్రపై రాళ్ళు రువ్వడాన్ని నాదెండ్ల మనోహర్ ఖండించారు. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలలో వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టడంతో పాటు దాడులు చేశారని ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలోను వైసీపీ శ్రేణుల అల్లరి మూకలు అలాగే చేస్తున్నాయని అన్నారు.

అసలు వైసీపీ శ్రేణులు ప్రతిపక్షాల ర్యాలీలలో రెచ్చగొట్టే బ్యానర్లు కడుతున్నారని, దీనిపై ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జగన్ ని ఇంటికి పంపడానికి ప్రజలకు ఆరు నెలల గడువు ఉన్నదని చెప్పుకొచ్చారు. మొత్తానికి లోకేష్‌కు జనసేన పరోక్షంగా సపోర్ట్ ఇస్తుంది.