అయితే ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు, వర్షాలకు.. వేలాది ఇండ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ ఆంక్షలతో సహాయక చర్యలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. బెంగాల్ తీరం వద్ద సుమారు గంటలకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కరోనా వైరస్ కన్నా అంఫాన్ తుఫాన్ ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. అంఫాన్ నష్టం సుమారు లక్ష కోట్ల వరకు ఉంటుందని ఆమె అంచనా వేశారు. ఈ తుఫాన్ కారణంగా దాదాపు అయిదు లక్షల మందిని షెల్టర్ హోమ్‌లకు తరలించామని ఆమె తెలిపారు. అలాగే.. .. ఒడిశాలో కూడా లక్ష మందికి పైగా షెల్టర్ హోమ్స్‌కు తరలించినట్లు తెలుస్తోంది. కాగా అతి తీవ్ర తుఫాన్‌గా మారిన అంఫాన్.. రానున్న మూడు గంటల్లో అల్పపీడనంగా మారనున్నట్లు ఐఎండీ అధికారి వెల్లడించారు. బెంగాల్ నుంచి ఈశాన్య దిశగా బంగ్లాదేశ్ వైపు తుఫాన్ ప్రయాణిస్తున్నదని… సుమారు గంటలకు 30 కిలోమీటర్ల వేగంతో అంఫాన్ ప్రయాణిస్తున్నట్లు ఐఎండీ స్పష్టం చేసింది.