బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పసిడి ధర పరుగులు పెడుతోంది. సామాన్యుడికి అందనంత దూరంలో.. బంగారం ధరలు కొండెక్కాయి. ఏడాదిలో దాదాపు 50 శాతం పెరిగాయి. అమెరికా, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా, జపాన్ దేశాల బలహీన ఎకానమిక్ డేటా ఇవన్నీ కలిసి పసిడి ధరను భారీగా పెంచేశాయి. అందుకు తోడు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది.