సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆదిత్య-ఎల్1 మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. శ్రీహరికోట నుంచి సెప్టెంబర్ 2వ తేదీన విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్1 లక్ష్యం దిశగా సాగుతోందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. రెండో భూ కక్ష్య పెంపు సంబంధించి ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్ను టెలిమెట్రీ,ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు.
ప్రస్తుతం 282 కిలో మీటర్లు బై 40,225 కిలోమీటర్ల దాటుకుని ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం నూతన కక్ష్యలో ప్రవేశించినట్లు ఇస్రో తెలిపింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబర్ 10 చేపడతామని వెల్లడించింది. సెప్టెంబర్ 3వ తారీకున భూ కక్ష్య పెంపు తొలి విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొంది.సెప్టెంబర్ 2వ తేదీన నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్1.. 63 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశించింది. 16 రోజుల పాటు భూ కక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనుంది.