కరోనా మహమ్మారి వల్ల సినీ ఇండస్ట్రీ లో కొందరు ఫామిలీస్ తో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు మరి కొంతమంది సోషల్ మీడియా లో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే . అందులో భాగంగానే ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న నటీమణులలో ప్రముఖ సినీ నటి ప్రగతి ఒకరు .ప్రగతి గారు డాన్స్ లు మరియు జిమ్ వీడియోలు ఫొటోలతో పదే పదే సందడి చేస్తున్న విషయం తెల్సిందే. సినిమాల్లో చూసిన దానికి సోషల్ మీడియాలో ఆమెను చూసిన దానికి ఎంతో తేడా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మరో వీడియోతో ప్రగతి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బంటీ ఔర్ బబ్లీ సినిమాలోని కజురారే పాటకు ప్రగతి డాన్స్ చేసింది.
ఈ వీడియోల ద్వారా నటి ప్రగతి గారు మరింత పాపులర్ అవుతున్నారు . నెట్టింట ఈమె వీడియోకు మంచి అభిమానులు అవుతున్నారు. ఈమె ఈ సోషల్ మీడియా సందడి అంతా కూడా కేవలం బిగ్ బాస్ ఎంట్రీ కోసం అంటూ ప్రచారం జరిగింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. నాకు ఇప్పటి వరకు చెడ్డ పేరు లేదు అలాగే డబ్బు అవసరం లేదు కనుక బిగ్ బాస్ ఎంట్రీ అవసరం లేదు అని క్లారిటీ ఇచ్చింది.