ఈరోజు నుంచే రైల్వే బుకింగ్.. తెలంగాణ నుంచి కదిలే రైళ్లివే..

sankranthi special trains

ప్రపంచ దేశాలను కరోనా అల్లకల్లోలం సృష్టించింది. ప్రజానీకాన్ని నానా బీభత్సం చేసింది. ముఖ్యంగా వలస కార్మికుల జీవితాలను చిందరవందర చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో కరోనా కారణగా విధించిన లాక్ డౌన్ తో వలస కూలీలు ఎటు వెళ్లాలో.. ఎక్కడ తల దాచుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. దేశంలో అమలౌతున్న లాక్ డౌన్ ను ఈ మధ్య కాస్త సడలింపునిచ్చింది. ఇందులో భాగంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్‌ రైళ్లకు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

అయితే టికెట్లు మాత్రం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలి. కౌంటర్లు బంద్‌ ఉంటాయి. నాన్‌ ఏసీతోపాటు ఏసీ కోచ్‌లనూ నడుపనున్నారు. అలాగే.. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్లు కూడా ఉన్నాయి. సికింద్రాబాద్‌, నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ల నుంచి కొన్ని రైళ్లు క‌ద‌ల‌నున్నాయి. వాటి జాబితాను ఓసారి చూసుకుంటే.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వ‌చ్చే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ముంబై నుంచి హైదరాబాద్ మ‌ధ్య న‌డిచే హుస్సేన్‌ సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మ‌ధ్య న‌డిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌, హౌరా నుంచి సికింద్రాబాద్ మ‌ధ్య న‌డిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్ నుంచి డనపూర్ వెళ్లే సూపర్‌ఫాస్ట్‌, గుంటూరు నుంచి సికింద్రాబాద్ మ‌ధ్య న‌డిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి నుంచి నిజామాబాద్ మ‌ధ్య న‌డిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌కు ఈరోజు ఉద‌యం నుంచి రిజ‌ర్వేష‌న్ టికెట్ సౌక‌ర్యం క‌ల్పించ‌నున్నారు. మొత్తానికి రైళ్ల ప్రయాణం సాగనుండటంతో ఓ రకంగా వసల కూలీలు ఊపిరి పాల్చుకుంటున్నప్పటికీ.. ప్రజల్లో ఈ రైళ్ల ద్వారా కరోనాపై నెలకొన్న ఆందోళనలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.