కరోనా ప్రభావం తెలంగాణలో రోజురోజుకూ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి చెందకుండా నివారణా మర్గాలను అన్వేషిస్తుంది. అందులో భాగంగా తెలంగాణలోని అనుమానం వచ్చిన ప్రతిచోటును గాలించి జల్లెడబట్టి మరీ తగిన పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. తాజాగా విదేశాలనుంచి వచ్చి ఉన్నారన్న అనుమానంతో హైదరాబాద్ లో ముఖ్యంగా ప్రతి ఇంటినీ గాలించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.
అదేవిధంగా అక్కడ పరిసర ప్రాంతాలలో జ్వరం, జలుబు, దగ్గు ఉంటే వెంటనే పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా అక్కడి పరిసర ప్రాంతాలను బట్టి ప్రభుత్వే స్వయంగా హెలికాప్టర్స్ ను రంగంలోకి దించి క్రిమిసంహారక మందులను పిచికారి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని కాచిగూడలో హెలికాప్టర్ నుంచి స్ప్రే చేస్తున్న ఘటన తాజాగా చోటుచేసుకుంది. దీని ద్వారా క్రిమికీటకాలను చంపేసి కొంతవరకు కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.