స్టార్ మా లో వదినమ్మ సీరియల్ ’ ఫేమ్ ప్రియాంక నాయుడు పరిచయం అవసరం లేని నటి . ప్రియాంక 2021 జనవరిలో తాను ప్రేమించిన మధుబాబును ( టీవీ నటుడు) ని పెళ్లి చేసుకుంది. ఇక మధుబాబు .. zee తెలుగు ప్రసారమైన ‘మంగమ్మగారి మనవరాలు’ సీరియల్‌లో సాకేత్‌గా మధుబాబు చాలా పాపులర్. ఆ తర్వాత ‘అభిషేకం’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’, ‘రెండు రెళ్లు ఆరు’… ఇలా వరుస సీరియల్స్‌తో బుల్లితెర పై బిజీ ఆర్టిస్ట్ గా రాణించాడు మధుబాబు .
అయితే ఈ జంట కొంతకాలంగా సీరియల్స్ కు దూరంగా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఈ జంట అభిమానులతో టచ్ లోనే ఉంటున్నారు .ఈ మధ్య మధుబాబు పుట్టినరోజు కావడంతో తన ఫాలోవర్స్ పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో అందరికీ స్పెషల్ థాంక్స్ చెప్పిన ఈ జంట.. కొన్ని ఫోటోలు, అలాగే ఓ వీడియో కూడా షేర్ చేశారు .
ఇక అసలు విషయానికి వస్తే త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రియాంక ప్రెగ్నెంట్. ఈ గుడ్ న్యూస్ ను వారు స్వయంగా అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది. దీంతో వీరి ఫాలోవర్స్పె తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు.దీంతో పాటు ప్రియాంకనాయుడు పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుతూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.