తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు టీఆర్ఎస్లో చేరారు.గ్రేటర్ హైదరాబాద్‌లో మరింత పట్టు సాధించేందుకు అధికార టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. క్షేత్రస్థాయిలో మరింత బలాన్ని పెంచుకునేందుకు ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో అనేక డివిజన్లను కైవసం చేసుకుని బలంగా సత్తా చాటిన బీజేపీ బలహీనపరిచేందుకు స్కెచ్‌లు వేస్తోంది.
ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా నలుగురు బీజేపీ కార్పోరేటర్లు గురువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలో అనేక డివిజన్లను కైవసం చేసుకున్న BJPని బలహీనపర్చేందుకు TRS అగ్రనేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా భాజపాకు చెందిన నలుగురు కార్పొరేటర్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం తెరాసలో చేరారు. మరింతమంది కార్పొరేటర్లను చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. దీనివల్ల క్షేత్రస్థాయిలో భాజపా బలహీనపడుతుందన్న భావనలో తెరాస వర్గాలు ఉన్నాయి. బీజేపీని బలహీనపరిచేందుకు మరికొంతమందితోనూ టీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది..