టీటీడీ భూముల వేలం పై జనసేనా అధినేత పంజా……

Pawan Kalyan Controversial Comments On TDP Leaders

తిరుమల తిరుపతి దేవస్థాన భూముల వేలంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. దేశంలోని అన్ని హిందూ దేవాలయాలు, సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాయని, ప్రపంచంలోనే అతి పెద్ద.. అత్యధిక ఆదాయం వచ్చే దేవాలయాల్లో ఒకటిగా ఉన్న టీటీడీ మంచి పద్ధతులను అనుసరించి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ వివరించారు. అదేవిధంగా ఒకవేళ టీటీడీ భూములను అమ్మేస్తే.. ఇతర దేవస్థానాలు కూడా ఈ పద్ధతులను పాటించే అవకాశముందని పవన్ కల్యాణ్ తెలిపారు. దీంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయని పవన్ కల్యాణ్ తెలిపారు.

 అలాగే… విభజనతో నష్టపోయి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. ఇప్పటికీ పూర్తి స్థాయి రాజధాని నగరం లేదని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు కావాలని, ఉద్యోగాలను సృష్టించాలని, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవాలని పవన్ వివరించారు. ఇటువంటి సమయంలో భూములు రెవెన్యూ కోసం ఉపయోగపడతాయని.. ప్రభుత్వ భూములను, ఆస్తులను సర్కారు తప్పనిసరిగా కాపాడుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలని అన్నారు. అయితే భక్తుల నమ్మకాలు, మనోభావాలు దెబ్బతీయడం, రాష్ట్రంలో భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులను బాగుచేసే అంశాలను కూడా ప్రమాదంలోకి నెట్టితే ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోరమైన తప్పుగా చరిత్రలో నిలిచిపోతుందని పవన్ కల్యాణ్ వివరించారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచనలు ఒకలా ఉంటే.. ప్రతిపక్షాల ఆలోచనలు వేరొలా ఉన్నాయి చూడాలి మరి.