టీమిండియా క్రికెటర్లపై విమర్శలు చేస్తూ వార్తల్లో ఉండే క్రికెట్ ఆటగాడు మాజీ ఓపెనర్ గౌతం గంభీర్. కొంతకాలంగా భారత్ జట్టుకు ధోనీ దూరంగా ఉన్న విషయం అందరికీ తెల్సిందే. జట్టుకు దూరంగా ఎందుకు ఉంటున్నాడు,ఇష్టం వచ్చిన సిరీస్ లో ఆడతాను అంటే ఎలా అని విమర్శలు చేశాడు.ఎవరైన రిటైర్మెంట్ అనేది ఎవరికి వారే వ్యక్తిగతంగా నిర్ణయం తీస్కోవాలి. ధోనీ భారత్‌కు మళ్లీ ఆడతాడా అనే విషయం సెలక్టర్లు మాట్లాడి తెలుసుకోవాలి. మళ్ళీ ఆడితే నచ్చిన సిరీస్ ని ఎలా ఎవరికి వలె సెలెక్ట్ చేస్కుంటారు అని గంభీర్ అడిగాడు.
పంత్ ఆటపై కూడా విమర్శలు చేసిన గంభీర్ ఇపుడు మాట మార్చి సపోర్ట్ గా మాట్లాడాడు. ఇంతకు ముందు ఈ యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను తొలగించాలంటూ చెప్పిన గంభీర్ ఇంకా అవకాశాలు ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ని కోరాడు. అతనిపై ఒత్తిడి పెంచడం సరికాదని, అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి పంత్ చాలా తక్కువ సమయం అయిందని అన్నాడు. పంత్ టెస్టుల్లో అంత టైమ్ తీసకోకపోయిన రెండు సెంచరీలు చేశాడు, కాబట్టి అతనిపై ఒత్తిడి పెంచవద్దని కోరాడు