యాక్ట్రెస్ కృతి శెట్టి ఉప్పెన’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ యంగ్ బ్యూటీ. తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా అక్కినేని నాగచైతన్యతో కలసి నటించిన ‘కస్టడీ’ చిత్రం విడుదలైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు విషయాలను పంచుకుంది. కృతి శెట్టి కి హీరోలలో రామ్ చరణ్, శివకార్తికేయన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది ఇంక బాలీవుడ్ నటి అలియా భట్ అంటే తనకు స్ఫూర్తి అని తెలిపింది.
కృతి శెట్టి తన యాక్టింగ్ లో ఎంట్రీ ఎలా ఆవకాశం వచ్చిందో కూడా తెలిపింది స్కూల్ డేస్ లో ఆరో తరగతి చదువుతున్నప్పుడే తనకు యాడ్స్ లో నటించే అవకాశం వచ్చిందని కృతి చెప్పింది. చదువుకుంటూనే యాడ్స్ చేసేదాన్ని అని తెలిపింది. తన తల్లి ఫ్యాషన్ డిజైనర్ అని షూటింగ్స్ కు తనతో పాటు వస్తుంటుందని చెప్పింది. షూటింగ్ లేని టైంలో ఇద్దరం ముంబైకి వెళ్లిపోతామని చెప్పింది . ఇంకా తన పెళ్లి విషయానికి వస్తే నాకు కాబోయే భర్త నిజాయతీగా, సింపుల్ గా ఉండాలని చెప్పింది. కొంచెం బొద్దుగా కూడా ఉండాలి అని తెలిపింది .