మలయాళం మూవీ ‘ప్రేమమ్’తో కుర్రకారు మదిని దోచుకుంది అనుపమ పరమేశ్వరన్. ‘అ ఆ’తో తెలుగు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ అమ్మడు తన ప్రేమ, ప్రేమికుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.అనుపమ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ, రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.తనకు ప్రేమపై మంచి అభిప్రాయం ఉందని, అందుకే ప్రేమ పెళ్లి మాత్రమే చేసుకుంటానని చెప్పింది.
తాను ప్రేమ పెళ్లి చేసుకుంటాననే విషయం ఇంట్లో కూడా తెలుసనని పేర్కొంది.ఇంటర్వ్యూలో ‘మీరు సింగిలా?’ అనే ప్రశ్న ఎదురుకాగా.. ఆ ఆసక్తికరమైన సమాధానం చెప్పింది అనుపమనేను సింగిల్ కాదు. మింగిల్ కాదు. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నా రిలేషన్షిప్ స్టేటస్ గురించి నాకు గందరగోళంగా ఉంది’ అని వివరించింది అనుపమ.నేను ప్రేమలో ఉన్నా.. అయితే అవతలి వైపు వ్యక్తి ఏమనుకుంటున్నారో తెలియడం లేదు. అయితే నాది వన్‌సైడ్ లవ్’ అంటూ నవ్వులు పూయించింది.