టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఇంటిలో విషాదం చోటు చేసుకుంది. ఆమె ఆడపడుచు శ్రీలక్ష్మీ అకాల మరణం పొందారు. . ప్రముఖ నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి. ఆమె కూడా అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉండడం వల్ల నటనకు ఆమె దూరంగా ఉన్నారు. శ్రీలక్ష్మి సోదరుడు రాజీవ్ కనకాల. శ్రీ లక్ష్మి భర్త సీనియర్ జర్నలిస్టు పెద్ది రామారావు.వీరికి 2002లో వివాహం కాగా ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీలక్ష్మీ కనకాల నేడు తుది శ్వాస విడిచారు.
గతేడాది రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. సుమకు, రాజీవ్ కనకాలతో పెళ్లి కాక ముందే… శ్రీలక్ష్మీకి ఆమె మంచి స్నేహితురాలు. ఇద్దరూ కలిసి సీరియల్స్‌లో కూడా నటించారు. సుమ, రాజీవ్ లవ్ స్టోరీలో కూడా శ్రీలక్ష్మీ మీడియేటర్‌గా పనిచేశారని ఇంటర్య్వూలో ఆమె చెప్పుకొచ్చారు. సుమతో ఆమెకు మంచి అనుబంధం ఉందని కూడా ఆమె అప్పట్లో తెలిపారు. రాజీవ్ సుమతో ఇంతటి అనుబంధం ఉన్న శ్రీలక్ష్మీ ఒక్కసారిగా చనిపోవడంతో సుమ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి.
కొద్ది నెలల వ్యవధిలోనే రాజీవ్ కనకాల ఇంటిలో రెండు దురదృష్ట సంఘటనలు చోటు చేసుకున్నాయి. విషయం తెలుసుకున్న చిత్ర ప్రముఖులు వారి కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.