యమునని మార్చిన కరోనా

కోరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచం వణికిపోతుంది. ఈ సమయంలో దాని ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించేందుకు లాక్ డౌన్ విధానాన్ని అమలు చేసి కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయి ఇళ్ళకే పరిమితం కావడంతో ఇంధన వినియోగదారులు భారీగా తగ్గిపోయారు. ఆంక్షలతో కూడిన ఈ అపూర్వమైన కాలానికి కొన్ని విషయాల్లో పెను మార్పులే సంభవించాయి. ముఖ్యంగా వాతావరణం, కాలుష్యం వంటి వాటిల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అంటే ఎప్పుడూ లేని విధంగా నమ్మశక్యంగాని రీతిలో కాలుష్యం ముఖ్యంగా.. వాయివు, నీటి కాలుష్య స్థాయిల్లో భారీస్థాయిలో చోటు చేసుకున్న మార్పులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయ. కాగా కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచం అంతా కలిగి ఉండటంతో దేశంలో 12వ రోజు లాక్ డౌన్ లో నడుస్తోంది.

అయితే కొన్నేళ్లుగా కాలుష్యంతో బాధపడుతున్న యమునా నది… తాజాగా స్వచ్ఛమైన నీటితో అసలు రూపంతో సాక్షాత్కరిస్తుంది. నీటి నాణ్యత మెరుగుపడింది. న్యూఢిల్లి నుంచి ఈ మధ్య రిలీజ్ చేసిన చిత్రాల్లో నీటి నాణ్యత భారీగా మెరుగుపడిన విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఈ మధ్య కురిసిన జల్లుల తర్వాత నీటి మట్టాలు స్థిరంగా పెరగడంతో.. చిత్రాలు వీడియోలు సముద్ర జీవనాన్ని.. వలస పక్షుల తిరిగి రావడాన్ని కూడా స్పష్టంగా వెల్లడౌతున్నాయని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంకా 21రోజుల లాక్‌డౌన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ విధించిన తర్వాత నగరంలో గాలి నాణ్యత కూడా గణనీయంగా మెరుగుపడింది. విజువల్స్ ప్రామాణికతను ధృవీకరించలేక పోయినప్పటికీ.. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణం వీస్తున్న చల్లటి గాలులు ఎంతో మధురమైన అనుభూతిని ఇస్తున్నాయని ప్రతి ఒక్కరు తమ భావాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నరు. మందపాటి నురుగు మలినాలతో నిండినప్పుడు.. నది పాత చిత్రాలను ఇప్పటి ఆహ్లాదకరమైన చిత్రాలను పంచుకుంటూ తమ అనుభూతులను వెల్లడిస్తున్నారు.