బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ ని ప్రారంభించిన కేటీఆర్….

తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ పరిధిలోని బయో డైవర్శిటీ జంక్షన్ వద్ద  మరో ఫ్లైఓవర్ ను ఈరోజు ప్రారంభించారు. సుమారు రూ. 30 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ తో బయోడైవర్శిటీ జంక్షన్ వద్ద  ట్రాఫిక్ సమస్య తీరనుంది. గచ్చిబౌలి నుంచి రాయదుర్గం మీదుగా మెహిదీపట్నం వైపు వెళ్లే  ప్రయాణికులకు సమస్యలు తీరనున్నయి. రూ.30 కోట్ల 26 లక్షలతో ఫస్ట్ లెవల్ ప్లైఓవర్ పనులు పూర్తి చేశారు అధికారులు. మూడు లైన్ల ఈ ప్లైఓవర్ పై ఒకే వైపు వాహనాలను అధికారులు  అనుమతిస్తారు.

అయితే 690 మీటర్ల పొడవు.. 11.50 మీటర్ల వెడల్పు గల మూడు లేన్ల ఫైఓవర్‌ నిర్మాణానికి రూ. 30.26 కోట్లు వ్యయం అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఫ్లైఓవర్‌ పూర్తి కావడంతో ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-4 కింద రూ. 379 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన జేఎన్‌టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు 12 కిలోమీటర్ల కారిడార్‌లో చేపట్టిన అన్ని ఫ్లైఓవర్లు పూర్తి అయ్యాయి.

కాగా సెకండ్ లెవల్ వంతెన గత ఏడాది నవంబర్ 4న అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. వరుస ప్రమాదాలతో కొన్నాళ్లు వంతెనను మూసేసిన అధికారులు…. స్పీడ్ లిమిట్ పెట్టి తిరిగి ప్రారంభించారు. ఇదే చౌరస్తాలో ఇప్పడు ఫస్ట్ లెవల్ వంతెన రెడీ అయింది. కాగా ఇప్పుడీ వంతెన అందుబాబులోకి రావటంతో గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే వారు జంక్షన్ వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి సిగ్నల్ చిక్కులు లేకుండా రాకపోకలు జరగనున్నాయి.