తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చింది. యెన్నం శ్రీనివాస్ రెడ్డిని బీజేపీ నుండి సస్పెండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంది.యెన్నం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై అధిష్టానం వేటు వేసింది . బీజేపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు.
కాగా, ఆశావహుల నుంచి బీజేపీ ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. దరఖాస్తులు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీసుకోనున్నారు. దీనికోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు.