భారీ బడ్జట్: 4 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్.. సర్వత్రా ఉత్కంఠ

ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ తో ఆర్థిక రంగం పూర్తిగా కుదేలైంది. కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో దేశంలోని ప్రధాన రంగాలన్నీ దెబ్బతిన్నాయి. దీంతో.. భారత ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎవ్వరూ ఊహించని విధంగా రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి భారత ప్రజలకు శుభవార్త తెలిపారు. కరోనాతో కుదేలైన రంగాలన్నింటికీ ఈ భారీ ప్యాకేజీ గొప్ప ఊరట కల్పించనుంది. అయితే, ఏఏ రంగాలకు? ఎంత ఎలా కేటాయింపులు చేస్తారు? అనే విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడిస్తారని నరేంద్ర మోడీ తన ప్రసంగంలోనే ప్రకటించారు. దీంతో..

అందరి దృష్టి ఇప్పుడు ఆర్థిక మంత్రి ఏం చెప్పనున్నారన్నదానిపైనే పడింది. దీంతో మరికొన్ని గంటల్లోనే కేటాయింపులు ఎలా అనే దానిపై ఓ క్లారిటీ రానుంది. ఎందుకంటే.. సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. కరోనా లాక్‌డౌన్‌ ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావాన్ని వివరించడంతో పాటు.. ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ప్రకటించిన రూ .20 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. మొత్తానికి నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ పై దేశంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.