రష్యా లూనా-25 కూలిన చోట భారీ గొయ్యి..

Huge pit where Russian Luna-25 crashed..
Huge pit where Russian Luna-25 crashed..

చంద్రుడిపై పరిశోధనల కోసం దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత రష్యా ప్రయోగించిన లూనా-25 సాంకేతిక కారణాలతో కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా లూనా 25కు సంబంధించి ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. లూనా-25 కూలి న ప్రదేశాన్ని నాసా గుర్తించింది. ఆ వ్యోమనౌక ఢీ కొట్టడం వల్ల జాబిల్లిపై 10 మీటర్ల వెడల్పున్న ఒక భారీ గొయ్యి ఏర్పడిందని నాసా తెలిపింది.

నాసా ఉపగ్రహం లూనార్‌ రికానసెన్స్‌ (ఎల్‌ఆర్‌వో) తీసిన చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ఫొటోల్లో ఇది కనిపించింది. వాటిని ఆ సంస్థ తాజాగా విడుదల చేసింది. 400 కిలోమీటర్ల దూరంలో ఉందని లూనా-25 ల్యాండింగ్‌కు ఉద్దేశించిన ప్రదేశానికి సూచించింది.. నాసాగత ఏడాది ఈ ప్రాంతాన్ని చిత్రీకరించినప్పుడు ఈ గొయ్యి కనిపించలేదని పేర్కొంది. లూనా-25ని గత నెల 11న రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆగస్టు 21న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగే యత్నంలో .. కొన్ని కిలోమీటర్ల ఎత్తులోనే విఫలమై కూలిపోయింది.