విక్రమ్ బ్రో స్మైల్ ప్లీజ్ .. చంద్రయాన్-3 ల్యాండర్ ఫొటో తీసిన నాసా శాటిలైట్.

Vikram bro smile please.. Chandrayaan-3 lander photo taken by NASA satellite
Vikram bro smile please.. Chandrayaan-3 lander photo taken by NASA satellite

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రపంచాన్ని అబ్బురపరిచేలా విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై ఇస్రో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది. లేటెస్ట్ అప్డేట్స్​కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. ప్రజల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే తాజాగా చంద్రయాన్-3కి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. అయితే ఈసారి ఈ అప్డేట్ ఇచ్చింది ఇస్రో కాదు.. అమెరికాకు చెందిన నేషనల్‌ ఏరోనాటిక్స్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(నాసా). నాసా చంద్రయాన్‌-3 ల్యాండర్‌ చిత్రాన్ని ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్ చేస్తూ.. తన ఉపగ్రహం ఈ ఫొటోను తీసినట్లు తెలిపింది.

‘జాబిల్లి ఉపరితలంపై ఉన్న చంద్రయాన్‌-3 ల్యాండర్‌ను నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఓ(లునార్‌ రికానజెన్స్‌ ఆర్బిటర్‌) స్పేస్‌క్రాఫ్ట్‌ ఫొటో తీసింది. నాసా ఆగస్టు 23న ఈ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువానికి సుమారు 600 కి.మీ దూరంలో దిగింది’ అని వెల్లడించింది. ల్యాండర్ దిగిన నాలుగు రోజుల తర్వాత ఆగస్టు 27వ తేదీన ఎల్‌ఆర్‌ఓ ఈ చిత్రాన్ని తీసింది. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ దిగుతున్నప్పుడు కలిగిన రాపిడి వల్ల ఒక తెల్లని వలయం ఏర్పడిందని ఈ చిత్రాలను బట్టి తెలుస్తోంది.