బలమైన ఆధారాలతోనే చంద్రబాబు అరెస్టు అయినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. చంద్రబాబు అరెస్టు లో అసలు విషయం పక్కకు వెళ్ళిలా టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని, ఎలాంటి దురుద్దేశాలు లేవని చురకలు అంటించారు. సిట్ బలమైన ఆధారాలతోనే ఏర్పాటు చేశామని ,జగన్ ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉందని వెల్లడించారు.
దర్యాప్తు సంస్థలు ఎంతో స్వేచ్చగా దర్యాప్తు చేస్తున్నాయని.. స్వాతంత్రియ భారత దేశంలో అత్యంత హేయమైన ఆర్ధిక నేరం అంటూ సజ్జల ఆగ్రహించారు . స్కీం పేరుతో స్కాం చేసారు కాబట్టే ఆర్ధిక నేరాల్లో నోటీసు ఇవ్వాల్సి అవసరం లేదన్నారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేదని చంద్రబాబు ఎవరిని దబాయిస్తున్నాడు?? ఈ స్కాం లో చంద్రబాబు పాత్ర ఉందని అందరికీ తెలిసిన విషయమే అని పేర్కొన్నారు. జగన్ వ్యక్తిగతం కక్ష సాధింపుకు వెళ్ళని స్వభావం కాదన్నారు. దర్యాప్తులో తేలాలి రాజకీయ ప్రమేయం ఉండకూడదనే రెండేళ్లు ఆగారని, దబాయించి బయట పడాలని చూస్తే ఇంకా సాధ్యం కాదని సజ్జల హెచ్చరించారు.