భారతదేశపు నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టివి బ్రాండ్ ఎంఐ ఇండియా నేడు తన అత్యుత్తమ విక్రయ నంబర్ సిరీస్ ఉపకరణాలకు సరికొత్త చేరిక- రెడ్‌మి 9ను ప్రకటించింది. నూతన స్మార్ట్ ఫోన్ రెడ్‌మి ఆవిష్కరణను వినూత్న ఫీచర్లతో ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో అందించే లక్ష్యాన్ని సంస్థ కలిగి ఉంది.
రెడ్‌మి ఇండియా లీడ్ స్నేహా టైన్‌వాలా మాట్లాడుతూ ‘‘ప్రతి రెడ్‌మి ఉపకరణంతో మేము సాంకతికతను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకు వస్తూ మేము వినియోగదారులకు చేరువ అవుతున్నాము. రెడ్‌మి సిరీస్ ప్రజాదరణ మా వినియోగదారులు మాపై చూపిస్తున్న విశ్వాసానికి సాక్ష్యంగా ఉంది. గతంలో పలు రికార్డులను అధిగమించిన మేము రెడ్‌మి9తో బడ్జెట్ వర్గంలో మేము అభివృద్ధి పరచిన సాంకేతికత అందరికీ లభించేలా చేయడమే లక్ష్యంగా కలిగి ఉన్నాము. ప్రీమియర్ డిజైన్‌తో ఉన్నత పనితీరును సమ్మిళితం చేసి వినియోగదారులకు ప్రారంభదశలోని స్మార్ట్ ఫోన్‌ను అందించే అనుభవాన్ని సరి కొత్తగా ఆవిష్కరించుకునే భరోసా ఇస్తున్నామని’’ తెలిపారు.
డిజైన్:
రెడ్‌మి9 ఔరా ఐకానిక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది 16.5 సెం.మీ(6.35) ఐపిఎస్ హెచ్‌డి+ డిస్‌ప్లే మమేకం అయ్యేటటువంటి వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ డిస్‌ప్లే టియువి రిన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి వచ్చింది. రెడ్‌మి9 వెనుక టెక్చర్ డిజైన్ కలిగి ఉండగా, ఇది వేలి ముద్రలు పడకుండా అడ్డుకుంటుంది. దీనితో ఉపకరణం తన ఆకర్షణీయమైన రూపాన్ని సదా కాపాడుకుంటుంది. ఈ ఉపకరణం ఏఐ ఫేస్ అన్ లాక్ కలిగి ఉండగా, మీ స్మార్ట్ ఫోన్‌ను ప్రతిసారీ సురక్షితంగా వినియోగించుకోడాన్ని సాధ్యం చేస్తుంది. దీని గత ఎడిషన్ల తరహాలో రెడ్‌మి9 డ్యుయల్ 4జి స్టాండ్‌బై సిమ్‌కార్డులను ప్రత్యేకమైన మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్‌తో మద్దతు పలుకుతుంది మరియు 3.5. మి.మీ. హెడ్‌ఫోన్ జాక్‌తో అందుబాటులోకి వస్తోంది.
కెమెరా:
రెడ్‌మి 9 ఏఐ డ్యుయల్ కెమెరాను కలిగి ఉండగా, అది వైవిధ్యమయ సన్నివేశాలను కచ్చితమైన అలానే స్పష్టమైన ఛాయాచిత్రాలను సులభంగా బంధించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఉపకరణం 13 ఎంపి మెయిన్ కెమెరా మరియు 2ఎంపి డెప్త్ సెన్సర్ ఎల్ఇడి ఫ్లాష్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఉపకరణం కెలెడియోస్కోప్, డాక్యుమెంట్ స్కానర్ మరియు పామ్ షటర్ తదితర ప్రత్యేకతలతో ఫొటోగ్రఫీకి సృజనశీలత మరియు ప్రొడక్టివిటీని అందిస్తుంది. ఏఐ సెల్ఫీ కెమెరా 5 ఎంపి సెన్సర్‌తో రూపుదిద్దుకుంది.
పనితీరు:
రెడ్‌మి9 మీడియా టెక్ హీలియో జి35ను కలిగి ఉండగా, ఈ ఆక్టా-కోర్ చిప్‌సెట్ 2.3 గిగాహెడ్జ్ వరకు విస్తృతిని కలిగి ఉంటుంది. ఈ ఉపకరణం 5000 ఎంఎహెచ్ ఉన్నత సామర్థ్యం కలిగిన బ్యాటరీని కలిగి ఉండగా, సంప్రదాయక స్మార్ట్ ఫోన్ బ్యాటరీలతో పోల్చితే 25% దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
నాణ్యత:
అన్ని రెడ్‌మి ఉపకరణాల తరహాలో రెడ్‌మి 9 ఉన్నత స్థాయి నాణ్యతను కలిగి ఉంది. రెడ్‌మి 9పి2ఐ నీటి నిరోధక లేపనాన్ని కలిగి ఉండగా, ఆకస్మికంగా నీరు పడినప్పుడు, ఫోన్‌ను రక్షించేందుకు ఆ లేపనం సహకరిస్తుంది. రెడ్‌మి 9 ముందుగా అలవర్చిన స్ర్కీన్ ప్రొటెక్టర్‌తో అందుబాటులోకి వస్తోంది.
లభ్యత:
రెడ్‌మి9 మూడు వర్ణాల మోడళ్లు: కార్బన్ బ్లాక్, స్పోర్టీ ఆరెంజ్ మరియు స్కై బ్లూలలో ఎంఐ.కాం, అమెజాన్ ఇండియా, ఎంఐ హోమ్స్ మరియు ఎంఐ స్టూడియోలలతో 31 August 2020 నుంచి విక్రయానికి లభిస్తుంది. 4జిబి+64జిబి వేరియెంట్‌కు రిటెయిల్ ధర INR 8999 మరియు 4జిబి+128జిబికు రిటెయిల్ ధర INR 9999 కలిగి ఉంది.
రెడ్‌మి 9 ప్రత్యేకతలు:
డిస్‌ప్లే | 6.53’’ హెచ్‌డి+ డిస్‌ప్లే
400 నిట్ (టైప్) బ్రైట్‌నెస్ టియువి రిన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ రీడింగ్ మోడ్ |
వెనుకవైపు కెమెరా | 13 ఎంపి మెయిన్ కెమెరా
2 ఎంపి డెప్త్ సెన్సర్ |
ముందు వైపు కెమెరా | 5ఎంపి ఫ్రంట్ కెమెరా |
కొలమానాలు | 164.9 x 77.07 x 9.0 మి.మి. |
ప్రాసెసర్ | మీడియాటెక్ హీలియో జి35
12ఎన్‌ఎం ప్రాసెస్ సాంకేతికత ఆక్టా-కోర్ సిపియు, 2.3 గిగాహెడ్జ్ వరకు |
బరువు | 196 గ్రా |
భద్రత | ఏఐ ఫేస్ అన్‌లాక్ కెమెరా |
బ్యాటరీ | 5000 ఎంఎహెచ్ (టైప్) బ్యాటరీ
10 W ఇన్-బాక్స్ ఛార్జర్ |
నెట్‌వర్కు | డ్యుయల్ 4జి స్టాండ్‌బై |
కనెక్టివిటీ | మైక్రో యుఎస్‌బి
3.5 మి.మి. హెడ్ ఫోన్ జాక్ బ్లూటూత్ 5.0 |
ఆపరేటింగ్ సిస్టం | MIUI 12 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 10 |
మోడళ్లు | 4జిబి+ 64జిబి, 4జిబి+ 128జిబి
512 జిబి వరకు విస్తరించుకునేందుకు అవకాశం ఉన్న స్టోరేజ్ |
లభించే వర్ణాలు | కార్బన్ బ్లాక్, స్పోర్టీ ఆరెంజ్, స్కై బ్లూ |