వేసేది విలన్ పాత్రలు. బయట మాత్రం ఆయన రియల్ హీరో. కరోనా కారణంగా లాక్డౌన్ విధించినప్పుడు ఎక్కడివారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లు, డబ్బులు, తినడానికి తిండి అన్ని ఉన్నవారి పరిస్థితి ఆ టైంలో బాగానే ఉంది. కానీ పొట్టకూటి కోసం అయిన వారందరిని వదిలి ఎవరూ తెలియని చోటుకు వచ్చి బతికే వలస కూలీల పరిస్థితే అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం అందించే సాయం అందకా, రైళ్లు,బస్సులు లేక సొంత గూటికి చేరలేక, ఉన్నచోట తినడానికి తిండి, ఉండటానికి నీడలేక వారు పడిన బాధలు వర్ణనాతీతం. అలాంటి సమయంలో వారిని ఆదుకోవడానికి ఆ విలన్ హీరోలా ముందుకు వచ్చాడు.
సినిమాలో హీరోలం అని చెప్పుకునే చాలా మంది చెయ్యలేని పనిని చేశాడు. రియల్ హీరో అని నిరూపించుకున్నాడు. మమల్ని ఎవరు ఆదుకుంటారా అని వలస కార్మికులందరూ ఎదురు చూస్తున్న క్రమంలో సోనూ సూద్ నేనున్నాను అంటూ వారిని సొంత గూటికి చేర్చాడు. వాళ్లందరిని బస్సులు, రైళ్లు ద్వారా అయినవారి చెంతకు చేర్చాడు. అప్పటి నుంచి ఎవరు ఏ సాయం అడిగిన అందిస్తూనే ఉన్నాడు. అక్కడి వారు, ఇక్కడి వారు అనే తేడా లేదు. ఎవరు కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక రైతుకు ట్రాక్టర్ కొనిచ్చి తన మానవత్వాన్ని మరోమారు చాటుకున్నాడు.
ఇలా అందరికి సాయం చేస్తున్న సోనూసూద్ ఆస్తి ఎంత? ఎంత ఆస్తి ఉంటే అంతలా సాయం చేస్తున్నాడు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో సోనూ సూద్ పై తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ అధ్యయనం చేయగా అతడి మొత్తం ఆస్తుల విలువ రూ. 130 కోట్లు అని తేలింది. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సోనూ సూద్ సినిమాల ద్వారానే ఆ డబ్బును సంపాదించినట్లు తెలుస్తోంది. నెగిటివ్ రోల్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న సోనూసూద్ ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకునే విలన్లలో ఒకడు. సినిమాలలో సంపాదించిన డబ్బుతో ముంబైలో హోటళ్లు తెరిచాడు సోనూసూద్. 2020లో ఆయన ఆస్తి విలువ రూ. 130 కోట్లు ఉంటే ఇప్పటికే 10కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక ముందు కూడా ఎవరు సాయమన్న నేనుంటాను అంటున్నాడు సోనూసూద్. అందుకే చాలా మంది రీల్ హీరోలను కాదు రియల్ హీరోలను ఫాలో అవుదాం అంటూ సోనూను ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు.