షాకింగ్ : మరణించినా వదలని కామాంధుడు.. పూడ్చివేత తీసి…

భార్య ఫై అనుమానంతో కిరాతకంగా చంపిన భర్త

కరోనాతో అంతా ఇళ్లకే పరిమితం కావడంతో సమాజం చాలా స్వచ్ఛంగా మారుతోంది అని ఓ పక్క మానవలోకం కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. కానీ ఇదే టైంలో అంతా చీకట్లో ఉన్న సమయాన్నే క్యాష్ చేసుకొని దుర్మార్గాలకు పాల్పడుతోన్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  నేరాల శాతం లాక్ డౌన్ లో కాస్త తగ్గినప్పటికీ అస్సలు జరగడానికి ఆస్కారం లేని నేరాలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు తగ్గిపోయాయి. కానీ.. కొంతమంది పైత్యం ప్రకోపించిన  కామాంధులు మాత్రం ఏదో ఒక రూపంలో నేరాలు చేస్తూనే ఉన్నారు. దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు.

తాజాగా అసోంలోని దెమాజీ జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. అస్సలు అది ఎన్నడూ కనీవినీ ఎరుగని దుర్ఘటన.  దెమాజీ జిల్లాలోని ఓ గ్రామంలో 14 ఏళ్ల బాలిక మే 17 వ తేదీన మృత్యువాత పడింది. ఆమెను సైమన్ నది ఒడ్డున పూడ్చిపెట్టారు. ఆ మరుసటి రోజే అదే గ్రామానికి చెందిన అకాన్ సైకియా అనే 51 ఏళ్ల వ్యక్తి సమాధి తవ్వి బాలిక శవాన్ని బయటకు తీసి అత్యాచారం చేశాడు. నది ఒడ్డున పూడ్చి పెట్టడంతో నదిలోకి చేపలు పెట్టేందుకు వెళ్తిన జాలరులు ఆ ఘటన చూసి షాక్ అయ్యారు. వెంటనే అతడిని పట్టుకొని ఆ బాలిక తల్లిదండ్రులకు అప్పజెప్పారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా సైకియా గతంలో ఎన్నో నేరాలకు పాల్పడ్డాడు. 2018 లో గృహహింస కేసులతో దెమాజీ జైల్లో గడిపాడు.

కాగా కరోనా విస్తరిస్తున్న ఈ సమయంలో ఖైదీలను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సైకియా కూడా రిలీజ్ అయ్యాడు. ఇలా బయటకు వచ్చినాగానీ.. తన నేర ప్రవృత్తిని మాత్రం వీడలేదు. అసలు ఆతడికి అలాంటి ఆలోచన రావడమే పెద్ద ప్రమాదంగా చెప్తున్నారు మానసిక శాస్త్రవేత్తలు. అంతేకాకుండా జైళ్లోంచి విడుదలైన సైకియా పలువురి ఆడవాళ్లను ఏడిపిస్తున్నాడని.. బహుశా ఆ బాలిక కూడా సైకియా వేధింపుల వలనే మరణించి ఉంటుందని అనుమానం వ్యక్తమౌతుంది. దీంతో పోలీసులు సైకియాపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.